ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులు పి4 కార్యక్రమం అమలు విధానంపై లోతైన చర్చలు జరిపి, అర్హులైన కుటుంబాలను గుర్తించడం, మార్గదర్శులను సమర్థవంతంగా అనుసంధానం చేయడం వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది అన్నారు.. ప్రతి కుటుంబం అభివృద్ధి చెందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.పి4 కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారి సామాజిక-ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా అధికారులు కట్టుబడి పనిచేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో డీడీఓ జనార్దన్ రావు , డివిజన్ పరిధిలోని ఎంపీడీఓలు నియోజకవర్గ విజన్ టీమ్ సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


