29 మంది మృతి
మాస్కో : రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏ ఎస్- 26 విమానం ప్రమాదానికి గురైంది. క్రిమియా మీదుగా వెళుతున్న క్రమంలో దాని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత అది కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా విదేశాంగ అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులతో సహా ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. సాంకేతిక సమస్య వల్లే ఈ ప్రమాదం సంభవించిందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. విమానంపై దాడి జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది.


