చెత్త తరలింపు వాహనాల పంపిణీ


విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలను చెత్తరహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నదే స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛంద కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు సక్రమంగా విడుదల చేస్తుందన్నారు. జగన్ పాలనలో ఏ పనిచేయాలన్నా డబ్బులు ఉండేవి కావన్నారు. ప్రస్తుతం పంచాయతీ ఖాతాల్లో నిధులు దండిగా ఉన్నాయని, రోడ్లు, త్రాగునీరు, స్మశానాల అభివృద్ధి లాంటి మౌలిక వసతులకోసం ఖర్చుచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
స్థానిక రెవిన్యూ సిబ్బంది నిర్లక్ష్యంపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఇకనైనా పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. సక్రమంగా పనిచేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందన్నారు. రెవిన్యూలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు.కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రజలనుంచి అర్జీలు స్వీకరించి, వాటిని త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. చివరగా ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడిపి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో
ఎంపీడీవో శంకరరావు, డిప్యూటీ తహసిల్దార్ మధుసూదన రావు, స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవులు,ఏఎస్ ఐ బ్రాహ్మయ్య మండల టిడిపి అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, సర్పంచ్ సాదు శ్రీలత, గ్రామపార్టీ అధ్యక్షుడు కాకుమాని ఆంజనేయులు, గ్రామ పెద్దలు దివి మోహన్ దాస్, గుత్తా మహేశ్వరరావు, వలేటి నరసింహం, కాకుమాని హర్ష, తిరుపతయ్య, కొంకా రమేష్, వలేటి మధు, అంజయ్య, ఖాజావలి, నాయబ్ రసూల్, కూనిపాలెం సర్పంచ్ రాజారమేష్, మాలకొండ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ చెరువుపల్లి మాల్యాద్రి,ప్రగడ శ్రీను, ఘట్టమనేని లక్ష్మీనరసింహం,చెరువుపల్లి సాంబయ్య,కామినేని అశోక్,శనివారపు మాల్యాద్రి రెడ్డి, లింగాలదిన్నె వెంకటేశ్వర్లు రెడ్డి,వడ్లమూడి వెంకటేశ్వర్లు, గొర్రెపాటి మాదవరావు, నవులూరి సుబ్బానాయుడు,పిల్లి రామచంద్రా రెడ్డి,పంది లక్ష్మీ నారాయణ, చెంచు శ్రీనివాసులు అన్ని గ్రామ పార్టీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The post చెత్త తరలింపు వాహనాల పంపిణీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *