టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం కు మంత్రి సత్య కుమార్ యాదవ్ శుభాకాంక్షలు


విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రంలోని టిడిపి పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో 44 ఏళ్ల రాజకీయ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న టిడిపి నాయకులకు కార్యకర్తలకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచి ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తున్న సాగుతున్న ఈ ప్రయాణం విశిష్టమైనదని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దృఢంగా నడిపిస్తుందని వారు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *