పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి..


క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే నిజమైన సంతృప్తి, సంతోషం ఉంటుందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 121వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి వెంకటేశులు (చిట్టి) మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో వైద్య సేవలు ప్రముఖ వైద్యులచే వైద్య చికిత్సలను అందిస్తున్నామని వారు తెలిపారు. ఈ శిబిరం కు దాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల భూషప్ప జ్ఞాపకార్థం కుమారుడు వేల్పుల వెంకటేశు వారి కుమారుల వ్యవహరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసి, వారి పేరిటన ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ పి. సతీష్ కుమార్, హైదరాబాద్ గ్యాస్ట్రో అండ్ లేపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జైదీపునేత, డాక్టర్ వినయ్ రోగులకు వైద్య చికిత్సలను అందించి ఆరోగ్యం పట్ల ఉండాల్సిన జాగ్రత్తలు తదితర వాటిని వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 325 మందికి వైద్య చికిత్సలు అందించి, ఒక నెలకు సరిపడా మందులను కూడా ఉచితంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల అశ్వత నారాయణ, బండి నాగరాజు, సిరివెళ్ల రాధాకృష్ణ, చందా జయ చంద్ర, పెద్దకోట్ల విజయ్, పెద్దకూట్ల భాస్కర్, బదనాథం రమణ, గుద్దిటి ఆదినారాయణ, చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *