శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీవో గా విధులు నిర్వర్తిస్తున్న సూర్యనారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య ప్రత్యేక అధికారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము, కలెక్టర్ ఆదేశాల మేరకు తాను బాధ్యతలను స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తన విధులను బాధ్యతగా నిర్వర్తిస్తానని, పురపాలక ప్రజలకు న్యాయం చేకూర్చుతారని తెలిపారు. పట్టణములో రోజువారి చెత్త సేకరణ, డంపింగ్ యార్డుల నిర్వహణ, శుభ్రతపై ప్రత్యేక డ్రైవరు నిర్వహిస్తానని, ప్రతివాటుకు సమయానికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. మురుగునీటి కాలువల శుభ్రపరిచే పనులు వేగవంతం చేసి నీరు నిల్వ సమస్యలను నివారిస్తానని తెలిపారు. మరమ్మతుకు నోచుకోని రోడ్లను మరమ్మత్తులు చేయించి వీధి దీపాలు నిర్వహణ అవసరమైన చోట్ల కొత్త వసతులను ఏర్పాటు చేస్తా నని తెలిపారు. ఆస్తి పన్ను, నీటి పన్నులను సమర్థవంతంగా నిర్వహించి మున్సిపాలిటీకి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుటకు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ద్వారా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తానని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని పట్టణ ప్రణాళికను కాపాడుతారని తెలిపారు. పట్టణ పరిశుభ్రతపెట్ల దృష్టి ప్రత్యేకంగా పెడతానని తెలిపారు. ఆన్లైన్ సేవలను బలోపితం చేసి ప్రజలకు సులభంగా సేవలు అందేలా చేస్తానని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతో సమన్వయంగా ఉంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని తెలిపారు.


