– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు
బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు ఒక్క అవకాశం ఇవ్వాలని సుమారు 90 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించినట్లు సమాచారం. మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఈ నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉంది. అయితే యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రికి అనుకూలంగా పదేపదే మాట్లాడడం ఇబ్బంది కలిగిస్తోంది. రాజకీయ కారణాలు ఏవైనా సరే క్రమశిక్షణే ముఖ్యం. తమ వ్యాఖ్యలతో ఇతరులను రెచ్చగొట్టాలని చూడడం సరికాదు. డీకే కు ఒక అవకాశం ఇవ్వాలని మా అందరి కోరిక కానీ దాని గురించి బహిరంగంగా ప్రకటనలు చేసి, గందరగోళం సృష్టించకూడదు అని ఇక్బాల్ మీడియాకు తో అన్నారు.


