రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు


విశాలాంధ్ర ధర్మవరం ; ఇటీవల వడగండ్ల వాన నువ్వు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం రైతు సంగం ఆధ్వర్యంలో అరటి తోటను సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మల్కాపురం గ్రామంలో నాగిరెడ్డి రైతు మూడు ఎకరాల అరటి తోటను సాగు చేయడం జరిగినదని ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాల కారణంగా అరటి తోట పూర్తిగా ధ్వంసం అయినదని తెలిపారు
ముఖ్యంగా పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా మధ్యలో జరుగుతున్న యుద్ధం కారణంగా రైతు పండించిన పంటకు ధర పూర్తిగా పడిపోయినదని తెలిపారు. ప్రస్తుతం అరటి కేజీ కేవలం రెండు రూపాయలు మూడు రూపాయలు తో వ్యాపారస్తులు అడుగుతున్నారని కనీసం ఆ పంటను కొనడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదని తెలిపారు. రైతు మూడు ఎకరాల పండించిన పంటకు దాదాపుగా 5 లక్షల వరకు ఖర్చు వచ్చినదని, యుద్ధం కారణంగా రైతు పూర్తిగా నష్టాలు ఊబిలో కూరుకుపోయినడని తెలిపారు. రైతు పండించిన పంటలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితిలో లేదని రైతుల కర్మకు ప్రభుత్వ వదిలేసినదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన అరటి పంటను ప్రభుత్వ పాఠశాలలకు అంగన్వాడి పాఠశాలలకు ప్రభుత్వం కొనుగోలు చేసి సప్లై చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక ప్రాంతాలలో అరటి పంటలను గిట్టుబాటు ధరలు లేక తోటలోనే వదిలివేయడం జరిగినదని కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు వెంటనే కల్పించాలని తెలిపారు. అంతేకాకుండా ముఖ్యంగా మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోకపోతే ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ హెచ్ భాష ఏపీ రైతు సంఘం సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మారుతి రమణ జె.వి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

The post రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.. సిపిఎం పార్టీ నాయకులు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *