గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే పరిటాల సునీత


విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారద్రోలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 మరియు పీ4( ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) – జీరో పావర్టీ కార్యక్రమాలు అమలులోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ఆమె గురువారం అనంతపురం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ.రామమోహన్, రాప్తాడు ఎంపీడీవో బి.విజయలక్ష్మితో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గత ఏడాది కాలంలో ఈ పథకాల
ద్వారా నియోజకవర్గంలో సాధించిన పురోగతిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
​ముఖ్యంగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న “బంగారు కుటుంబాల” జీవన ప్రమాణాలు ఏ మేరకు మెరుగుపడ్డాయో క్షేత్రస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31న రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కుటుంబాలతో ముఖాముఖి చర్చలు జరిపి, పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మార్గదర్శులను ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు వెల్లడించారు. ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాల ఫలాలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *