ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.
ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.
ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్ నంబర్లను అధికారులు అందుబాటులో ఉంచారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు:
6304285613
9985733999
7989537285
9703578434
ఈ నంబర్లకు కాల్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.
The post మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు appeared first on Visalaandhra.


