మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..


సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున రూ.23,000 వెరసి రూ.33,000 అందజేశారు.ట్రస్ట్ చైర్మన్ తల్లం నారాయణమూర్తి, చిన్న తంబీ చిన్నప్ప, జగ్గా వేణుగోపాల్ మాట్లాడుతూ నిరంతర సేవాభావంతో అనాధ శవాలకు అంత్యక్రియలను నిర్వహించే ఈ దంపతులకు ఆర్థిక ఆత్మీయ సహకారం మా సంస్థ తరఫున అందించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ముందు కూడా ఈ కుటుంబానికి మా అండదండలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నాగ లింగం, గంగాధర్ గుప్తా, ఆంజనేయ చౌదరి, నర్సింహారెడ్డి, బి.రామకృష్ణ ,రాంప్రసాద్, మోహన్ దాస్ ,రమేష్, జింక చిన్నప్ప, ప్రతాపరెడ్డి, టి. రామకృష్ణ, మనోహర్ గుప్తా , చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *