విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ వారి ఆదేశాల మేరకు ఈ అథెటిక్స్ ఎంపికలు నిర్వహించడం జరిగిందని హాకీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, స్కూల్ గేమ్ కార్యదర్శి లక్ష్మీనారాయణ, సుహాసిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, బాక్సింగ్ కోచ్ ఓం ప్రకాష్, హాకీ కోచ్ హసేన్, ఫెన్సింగ్ కోచ్ ప్రతాప్, అథ్లెటిక్స్ కోచ్ శబరి గిరి తెలిపారు. వారు మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల్లో 40 5 సంవత్సరాలు పైబడిన పురుషులు 35 సంవత్సరాలు పైబడిన మహిళలు పాల్గొనడం జరిగిందన్నారు. ఇందులో పోటీ పడగా రాష్ట్రస్థాయికి టి. షబానా బాను, ఏం లోకేశ్వరి, కే.వసంతకుమారి, ఏం. అంజలి దేవి, సి.రాజమ్మ, ఎస్, రామ్ కిరణ్ కుమార్, ఎం, విజయ్ కుమార్, బి సూర్య ప్రకాష్ ఎంపిక కావడం జరిగిందన్నారు. వీరందరూ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నందు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలైన వారందరికీ కూడా నిర్వాహకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
The post ఘనంగా అథెటిక్స్ ఎంపికలు appeared first on Visalaandhra.


