సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్
విశాలాంధ్ర -ధర్మవరం: ధర్మవరం పట్టణంలో అర్హులైన పేదలకు రెండు సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కూడా మూడు సెంట్ల ఇంటి స్థలమును ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ధర్మవరం పట్టణం రూరల్ ప్రాంతాల్లో అర్హులైన ఇల్లు లేని నిరుపేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్టుకోవాలన్నారు. గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన హామీ ని వెంటనే అమలు చేయాలి అని తెలిపారు. పేదల సొంతింటి కల, కలగానే మిగిలిపోకూడదని
కూలీ నాలి చేసుకుంటున్న పేద ప్రజలు బాడుగలు కూడా కట్టలేక పిల్లల చదువులు ఫీజులు వారి జీవనాధారానికి కావలసినంత ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామాల్లో మూడు సెంట్లు,పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి పక్క గృహాలు కట్టించి ఇవ్వాలి అని తెలిపారు. భూమిలేని నిరుపేదలకు సాగు భూమిని పంపిణీ చేయాలి అని, అలాగే టిడ్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలిఅని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు, ఎర్రంశెట్టి రమణ, శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకల రాజా, రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, మహిళా సమైక్య లీడర్స్ లలితమ్మ, లింగమ్మ, ఈరమ్మ, మరియు, శ్రీనివాసులు, గోవింద రాజు, లక్ష్మీనారాయణ, సుబ్బు, మసూద్, జనార్దన్, చిన్న,బాబు తదితరులు పాల్గొన్నారు.


