విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో మట్టిని తవ్వకూడదని, దాన్ని తరలించకూడదని, నదీ తీర ప్రాంతాల్లో బాటలు వేసివాహనాల ప్రయాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా, అవన్నీ తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం అన్యాయాలకు పాల్పడుతుందని, బ్యాంకుల్లో లోన్లు పొంది ఉన్న పొలాలను సైతం దొంగ పట్టాలు సృష్టించి, అధికారులపై ఒతీళ్ళు చేసి అనుమతులు పొంది అక్రమంగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, మీటర్ తవ్వడానికి పర్మిషన్ తీసుకుని రెండు మీటర్ల పైచిలుకు మట్టిని దోచేసారని, తవ్విన మట్టిని 14 వేలకు పైగా బయట విచ్చలవిడిగా అమ్ముతున్నారని, వందల లారీల కొద్దీ మట్టిని పంట పొలాలను తవ్వి యదేచ్చగా తరలిస్తున్నారని వేణు ఆరోపించారు. గతంలో ఏనాడూ లేని విధంగా లంక ప్రాoతాల్లో అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును కోల్లగోడుతున్నారని తద్వారా వారి జేబులు నింపుకోవడానికి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్నారని అన్నారు. సీనియర్ శాసనసభ్యులు అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గ పరిధిలో మట్టి మాఫియా చెలరేగిపోయి నది తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిని దోచుకుంటుంటే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. మట్టి త్రవ్వకాలు నిలిపివేయకపోతే తామే స్వయంగా ధర్నా చేసి జెసిబిలను, లారీలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, మండల పార్టీ అధ్యక్షులు యాదల సతిష్ చంద్ర స్టాలిన్, కొత్తపల్లి శివాజీ, ఈలి గోపాలం, తిరుమలశెట్టి శ్రీను, తాడాల చక్రవర్తి, సింగంశెట్టి శ్రీను, బోడపాటి సత్తిబాబు, గాద రామకృష్ణ, కొత్తపల్లి మూర్తి, రత్నం కృష్ణ, ముత్యం జగదీశ్, గాద సాయిరాం, మార్గాని బలరాం, చీకట్ల మాచరయ్య, అయితిరెడ్డి అయ్యప్ప, ఆకుల సుధాకర్, సాపిరెడ్డి సూరిబాబు, దాసరి శ్రీను, తిరికోటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


