సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ


తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రధాన సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తిన నేపథ్యంలో, అధికారులు సాంకేతిక బృందాలను రంగంలోకి దింపారు. సర్వర్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *