విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : తాగునీటి నాణ్యత పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంగళవారం ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో సచివాలయ ఇంజనీర్లకు, కార్యదర్శులు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో రవి ప్రసాద్,మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఐజయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఫీల్డ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షించడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించవచ్చని వివరించారు. ఫీల్డ్ టెస్ట్ కిట్ల వినియోగం, నీటిలో ఉన్న మలినాలను గుర్తించే విధానం, పరీక్షల ఫలితాల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. గ్రామస్థాయిలో తాగునీటి భద్రతను పెంచడంలో ఫీల్డ్ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అధికారులు సూచించారు.


