నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు
శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా జాదిబాల్, కమర్వారీ, హస్సినాబాద్, షాలిమార్, లావేపోరా, బెమినా ప్రాంతాల్లో విరాళాలు చేకరించడానికి మేళాలు నిర్వహించారు. ఒక మహిళ 28 ఏళ్ల కిందట మరణించిన తన భర్త గుర్తుగా పెట్టుకున్న బంగారాన్ని ఇరాన్‌కు విరాళంగా ఇచ్చింది. షియా జనాభా ఎక్కువగా ఉండే బుద్గామ్, బందిపోరా, బారాముల్లా జిల్లాల్లోనూ ఈ మేళాలను నిర్వహించారు. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కశ్మీర్ ప్రజలకు, భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. విరాళాల ఫొటోలను పంచుకుంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడంలో భారత్ ఎప్ప్పుడూ ముందుంటుందని కాశ్మీరీలు నిరూపించుకున్నారు.
The post యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం appeared first on Visalaandhra.


