రూరల్ ఎస్సై రాజశేఖర్
విశాలాంధ్ర -ధర్మవరం; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో నివసించు బి. శ్రీనివాసులు(35)కుటుంబ కలహాలతో శనివారం అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకొని మృతి చెందాడు. వివరాలకు వెళితే మృతుడు బి శ్రీనివాసులు ఆరు సంవత్సరాల కిందట మహేశ్వరి అనే అమ్మాయిని వివాహం చేసుకొని, కుటుంబ కలహాలతో భార్య మృతి చెందింది. భార్య చనిపోవడంతో మద్యముకు బానిస అయ్యాడు. మధ్యము మాని, మరో పెళ్లి చేస్తే బాగుపడుతాడు అన్న ఉద్దేశంతో నాన్న అదెప్ప మరో పెళ్లి చేస్తే బాగుపడుతాడని అనుకొని ముదిగుబ్బ మండలం సిరి గారి పల్లె లోని నందును ఐదు సంవత్సరాల కిందట ఘనంగా పెళ్లి చేశారు. మద్యానికి బానిస అయిన మృతుడు శ్రీనివాసులు, యధా ప్రకారం మద్యం తాగుతూ ఇంట్లో భార్యతో గొడవ పడేవాడు. మృతుని తల్లిదండ్రులు వేరే ఇంట్లో ఉండేవారు. తరచూ ఇంట్లో భార్య భర్తల నడుమ కుటుంబ సమస్యలపై గొడవ జరిగేది. దీంతో విసుగు చెందిన రెండవ భార్య నందు తన అమ్మగారిలైన ముదిగుబ్బ మండలం సిరి గారి పల్లెకు నాలుగు నెలల కిందట వెళ్లిపోయింది. దీంతో కొన్ని నెలలుగా మృతుడు తన ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. చివరకు మనస్థాపనతో ఉరివేసుకొని మృతి చెందాడని కుటుంబ బంధువులు తెలుపుతున్నారు. మృతుని తమ్ముడు ఆదివారం ఉదయం నిద్ర నుంచి లేపడానికి వెళ్లగా ఉరి వేసుకున్న దృశ్యం చూచి తల్లిదండ్రులకు సమాచారాన్ని ఇచ్చారు. మృతుడు కూలి మగ్గం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. తదుపరి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను విచారణ చేసి, మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. తండ్రి ఆ దెబ్బ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగిందని ఎస్ఐ. రాజశేఖర్ తెలిపారు.


