ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డొమ్మేటి వెంకట రెడ్డిజయంతి వేడుకలు ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్, డా. కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డిగారు మట్లాడుతు..దొమ్మేటి వెంకటరెడ్డి (1853–1928) తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సామాజికవర్గ ఆద్యులు,దాత అన్నారు. 1920లో ఈండ్ర/ఈడిగ కులాన్ని ‘సెట్టిబలిజ’గా గుర్తింపు తెచ్చి, సంఘాన్ని సంఘటితం చేశారు అని తెలిపారు. గాంధీజీకి ముందే వయోజన విద్య, విద్యాభివృద్ధికి కృషి చేసిన ఆయన, కోనసీమ ప్రాంతంలో కుల వివక్షపై పోరాడి, విద్యా సంస్థలను స్థాపించడం జరిగిందన్నారు.ప్రజల విద్య కోసం పాఠశాలలు స్థాపించి, నాటి కాలంలోనే వయోజన విద్యను ప్రోత్సహించి, పేదల అభివృద్ధికి, సంఘం అభ్యున్నతికి తన సంపదను వినియోగించారు అని తెలిపారు. ఆయన సేవలకు గుర్తుగా కోనసీమ, పరిసర జిల్లాల్లో పలు చోట్ల ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసి జయంతి వేడుకలను నిర్వాహిస్తారని తెలిపారు. డా.బి.గోపాల్ నాయక్ మాట్లాడుతూ సమాజంకోసం త్యాగం చేసిన వాళ్ళు మహనీయులనీ, వారు చరిత్రలో ఎప్పుడో ఒక్కసారి త్యాగఫలితంగా గుర్తించ బతుడుతుందనీ, అలాంటివారిలో దొమ్మేటి వెంకటరెడ్డి ఒకరిని, వారి త్యాగఫలితం మరవలేమని తెలిపారు.ఈ కార్యక్రమంలో , డాక్టర్ వైస్ ప్రిన్సిపాల్, ఎస్. చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్,డా. బి. త్రివేణి, డి ఎస్.షమీయుల్లా, ఎస్.పావని, ఎం.భువనేశ్వరి, టి.సరస్వతి, ఎం.పుష్పావతి, బి.ఆనంద్, జి.మీనా, జి. ధనుంజయ తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది , ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
The post ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra.


