విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో విడిచిపెట్టాలని, ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.


