తెహ్రాన్: అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాన్ని ఇరాన్ ద్బెతీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఎఫ్-35 యుద్ధ విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోవడంతో అది పశ్చిమాసియాలోని అమెరికా స్థావరంలో అత్యవసరంగా దిగిందని ఇరాన్ ఒక ప్రకటన చేసింది. ‘మా గగనతల రక్షణ వ్యవస్థ అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా సైన్యానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని దెబ్బతీసింది. అది ఏ స్థాయిలో దెబ్బతిన్నదనే దర్యాప్తు చేస్తున్నాం. విమానం పూర్తిగా ధ్వంసం కావడానికే ఎక్కువ అవకాశాలున్నాయి’ అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ వెల్లడించింది. గాలిలో విమానాన్ని ఒక క్షిపణి ఢీకొడుతున్నట్టుగా ఉన్న వీడియోను ఇరాన్ విడుదల చేసింది. ఇదే ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందించారు. ఓ యుద్ధ విమానం అత్యవసరంగా దిగిందని, దానికి పెద్దగా నష్టం జరగలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని హాకిన్స్ తెలిపారు. కాగా ఎఫ్`34 ఈ విధంగా అత్యవసరంగా దిగడం మునుపెన్నడూ జరగలేదు. ఈ విమానం విలువ 82.5 మిలియన్ డాలర్లు ఉంటుంది.
The post అమెరికా ఎఫ్-35కి ఇరాన్ దెబ్బ appeared first on Visalaandhra.


