నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు
తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా రాయబారితో మాట్లాడుతూ జీవించే ఉన్నానని చెప్ప్పుకోవడం తెలిసిందే. తాజాగా ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ ఆరోగ్యంగా ఉన్నారని ధ్రువీకరించేందుకు ఆ దేశం అధికారిక మీడియా ఐఆరఐబీ ఓ వీడియోను ప్రచారం చేసిం ది. కొందరు మత పెద్దలతో కలిసి ముజ్తబా ఉన్న దశ్యాలు అందులో కనిపించాయి. అయితే ఆ వీడియో ఎప్పడు తీశారన్నది ప్రస్తుతం చర్చనీయాం శంగా మారింది. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని తన మరణ వార్తలను మరోమారు ఖండించారు. తాజాగా మీడియా సమావేశానికి హాజరైన ఆయన ఆంగ్లంలో మాట్లాడారు. ‘అన్నింటికంటే ముందు నేను సజీవంగా ఉన్నానని చెప్పాలి. ఇందుకు మీరం తా సాక్షులే. ఇప్పటికి ఈ తప్ప్పుడు ప్రచారానికి తెర పడింది. ఇక ఆపరేషన్ రోరింగ్ లయన్ గురించి తాజా వివరాలు వెల్లడిస్తాను’ అని ఆయన చెప్పారు. కాగా, నెతన్యాహు చనిపోయారని, ఆయన ఏఐ వీడియోలు ప్రచారంలోకి వస్తున్నాయన్న అనుమానాలున్నాయి. సీఎనఎన్ వంటి కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు తమ విలేకరులతో నెతన్యాహు మాట్లాడుతున్న వీడియోలు ప్రసారం చేస్తూ, ఆయన బతికే ఉన్నారని రుజువు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
The post బతికే ఉన్నాం appeared first on Visalaandhra.


