ప్రపంచానికి పరీక్షా సమయం


న్యూదిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు కేవలం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షగా మారాయని పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వెల్లడిం చింది. ఈ మేరకు విదేశాంగశాఖ సహా వివిధ విభాగాల ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘కువైట్ యువరా జుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాం. వీటి ఫలితంగా రెండు ఎల్‌పీజీ నౌకలను హోర్మూజ్ జలసంధి మార్గం ద్వారా తీసుకురాగలిగాం’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. మరోవైపు… చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకుగాను రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగు కేటాయించాలని బొగ్గు మంత్రిత్వశాఖ ఇప్పటికే కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

The post ప్రపంచానికి పరీక్షా సమయం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *