నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం – Visalaandhra


కేసీఆర్ సభకు రావాలి
గవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శి
భవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్

విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్ప్పుడు అదే అహంకార ధోరణి ప్రదర్శించారని, ప్రజలు బుద్ధిచెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్ప్పుడూ అదే తీరుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. 2023, డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రూ. కోటి 6 లక్షల 56 వేల 674 జీతభత్యాలు పొందారని వివరించారు. విధులకు హాజరు కాకుండా జీతభత్యాలు తీసుకోవడంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా కేసీఆర్ సభకు రావాలని, వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, రాష్ట్ర అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ ను ఆవిష్కరిస్తూ… రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చరిత్రాత్మకమన్నారు. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి అని వెల్లడించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ఠ ప్రణాళిక అని వివరించారు. అటువంటి గొప్ప సంకల్పాన్ని, పవిత్ర శాసన సభ వేదిక నుంచి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శుక్లాకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి కొత్త గవర్నర్ కు శుభాకాంక్షలు చెబుతారని భావించామని అన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు రాలేదని దుయ్యబట్టారు. గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలని గవర్నర్ ప్రసంగంలో వివరించారని, సంక్షోభ సమయంలో దేశ ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన తీసుకున్న ప్రణాళికలతోనే ఇవాళ దేశం ఈ పరిస్థితుల్లో ఉందని, మొదటి తరంలో నెహ్రూ- ఇందిరా గాంధీ గొప్ప విధానాలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. సరళీకృత విధానాలతో దేశ ఆర్థికగతిని మార్చిన ఘనత పీవీ నరసింహారావుదని, 1990 నుంచి 2020 వరకు 30 ఏళ్లు పీవీ నుంచి మన్మోహన్ సింగ్ వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. భవిష్యత్ లో ఏఐ సునామీ రాబోతుందని, దీనిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించిన ఒక పాలసీ డాక్యుమెంట్ ను గవర్నర్ ప్రసంగంలో వివరించారని అన్నారు. ఇది నవశకానికి నాంది పలుకాల్సిన సమయమని, అధికారం కోల్పోయామన్న దుఃఖమే తప్ప ప్రభుత్వానికి సహకరించాలన్న ప్రధాన ప్రతిపక్షానికి ఆలోచన లేదన్నారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించుకున్నామని, గత ప్రభుత్వంలో అక్రమ నిర్మాణాలపై సభలో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడిన మాటలను సభకు సీఎం వినిపించారు.
అప్ప్పుడు సక్రమం… ఇప్ప్పుడు అక్రమం ఎలా అయింది?
గతంలో బీఆరఎస్ అధికారంలో ఉన్నప్ప్పుడు ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా కొట్టిపారేయాలని మాట్లాడారు. మరి అప్ప్పుడు సక్రమం అని చెప్పిన వాళ్లకు ఇప్ప్పుడు అక్రమం ఎలా అయిందని సీఎం నిలదీశారు. మూసీ ఉప్పల్ భగాయత్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూసొద్దాం రండి అని అన్నారు. ఎవరెవరు ఎక్కడ ఆక్రమించుకున్నారో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేద్దామన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి పన్ను మినహాయించామని చెప్పారు. త్వరలో క్యూర్ పరిధిలోని ఆటోలను ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామన్నారు. మన నగరాన్ని మనం పరిరక్షించుకోకపోతే, చెరువులను పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరం మనల్ని క్షమించదన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *