విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు, వరప్రసాద్, మాజీ సర్పంచ్ గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు, తదితర నాయకులు దివ్యాంగులకు టికెట్లు అందజేసి, బస్సులో ప్రయాణం ప్రారంభింపజేశారు. దివ్యాంగులకు ఉచిత రవాణా సౌకర్యం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాయకులు తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది దివ్యాంగులు ప్రయోజనం పొందనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి, ఆర్టీసీ డిఎం హంపన్న, స్థానిక టిడిపి నాయకులు మాజీ ఎంపీటీసీ సుంకన్న, మోకా రామాంజనేయులు, వార్డు సభ్యులు రామాంజనేయులు, కార్యకర్తలు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


