రష్యా నుంచి చైనాకు చమురు ట్యాంకర్.. భారత్ దిశగా…


చైనాకు తరలిస్తున్న రష్యా చమురు ట్యాంకర్ అక్వాటైటాన్ భారత్ వైపు మళ్లింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది భారత్ దిశ వైపు తిరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం దేశంలో చమురు సంక్షోభం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి భారత్ దిగుమతులను పెంచింది. ఈ క్రమంలో అక్వాటైటాన్ ట్యాంకర్ మార్చి 21న కర్ణాటకలోని న్యూమంగళూరుకు చేరుకోనుంది. ఈ ఏడాది జనవరి చివరలో బాల్టిక్ సీ పోర్టులో ఈ ట్యాంకర్‌లోకి చమురు లోడ్ అయింది. ఈ నౌక వాస్తవానికి చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సి ఉంది. యుద్ధం నేపథ్యంలో రష్యా చమురును కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించిన నేపథ్యంలో, ఇప్పుడు దిగుమతులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత రిఫైనరీలు రష్యా నుంచి 30 మిలియన్ల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. జపాన్, దక్షిణ కొరియా దేశాలు కూడా రష్యా చమురు దిగుమతులను పెంచడంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు ట్యాంకర్లు సహా 90 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటాయి. ఈ నౌకలన్నీ తమ ట్రాకింగ్ వ్యవస్థలను ఆపేసి, డార్క్ మోడ్‌లో పాశ్చాత్య దేశాల ఆంక్షలను దాటుకుని హర్ముజ్ మీదుగా ప్రయాణించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *