జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి
విశాలాంధ్ర ఏలూరు: జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో నివసించే ప్రజలకు అవసరమైన త్రాగునీరు బోర్లు,పైపులైన్లు, ,రోడ్లు వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటుచేసేందుకు అవకాశాలను పరిశీలించి నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో సోమవారం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాల కల్పనపై జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి లతో కలిసి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిలాల్లోని నూజివీడు, పోలవరం, నియోజకవర్గాలలోని రిజర్వ్ ఫారెస్ట్,అభయారణ్య ప్రాంతాలు, కొల్లేరు లోని అభయారణ్య ప్రాంతాలలో నివాసిత ప్రాంతాలలో త్రాగునీరు బోర్లు,పైప్ లైన్లు,రోడ్లు, వంటి కనీస సౌకర్యాల కల్పనకు, అదేవిదంగా గిరిజన అటవీ ప్రాంతంలో పి.ఎం.జన్ మన్ కార్యక్రమంలో నిరుపేద గిరిజనులకు ఇళ్ల నిర్మాణం, ఆ ప్రాంతాలలో ప్రజలకు కనీస సౌకర్యాలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వేంటనే చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, పంచాయతీ రాజ్,రోడ్లు,భవనాల శాఖ,ఆర్ డబ్ల్యూ ఎస్., శాఖల ఎస్ఈ లు జెడ్. రమేష్,రమేష్, త్రినాధ్ బాబు, గృహ నిర్మాణశాఖాధికారి సత్యనారాయణ,అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.


