అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం


జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ

విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజులు కఠోర ఆమరణ నిరాహార దీక్షతో పాటు పోరాడిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. నేటి తరంతో పాటు భవిషత్తు తరాలు గుర్తుంచు కునేలా రాష్ట్ర రాజధాని అమరావతి లో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహం, ఆరున్నర ఎకరాల్లో స్మృతి వనం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. నేడు పొట్టి శ్రీరాములు 58 అడుగులు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఆవిష్కరించారని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం దేశవ్యాప్తంగా స్వభాషా రాష్ట్రాలు ఏర్పాటుకు ప్రేరణగా నిలిచాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఘంటా ప్రసాదు,జిల్లా పరిషత్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *