కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి


విశాలాంధ్ర కళ్యాణదుర్గం టౌన్… కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కుందుర్పి మండలం కదరంపల్లి గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్ వెల్ కూలీ సంతురాం (35) మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గత కొన్ని నెలలుగా బోర్ వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న సంతురాం, పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. ఈ సమయంలో డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో సంతురాం వాహనం కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *