కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి – Visalaandhra


ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం...

జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావు
విశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రపంచ మానవాళిని చౌతన్య పరిచి సమసమాజ స్ధాపనే పరిస్ధితులను మార్చుగలదని ఉద్భోదించిన మీVAన్నతమైన తత్వవేత్తని కొనియాడారు. పెట్టుబడిదారి, దోపిడీ విధానాలను రూపుమాపితే ప్రజలను సమాన హక్కులు దక్కుదాయని భావించి ప్రజలను చైతన్య పరచడంలో విజయం సాధించారని అన్నారు. విపత్కర ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టులాడుతున్న ప్రపంచాన్ని బయటపడేందుకు అయన అనుసరించిన మార్గం అనుసరణీయమని తెలిపారు. సమాజంలో ఉన్న వర్గ పోరాటాలు, కార్మికుల హక్కులు, పెట్టుబడిదారీ వ్యవస్ధపై విమర్శలతో ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక ఆలోచనలపై ఆయన విశేష ప్రభావం చూపారని తెలిపారు. కార్ల్ మార్క్స్ వేసిన మార్గంలో నడవటమే నిజమైన నివాళులు అని తెలిపారు. సీపీయం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ వర్ధంతి సభలు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. ఆయన ముందు అనేకమంది తత్వవేత్తలు సమాజం గురించి పలు రకాలుగా విశ్లేసించి విప్లమయ్యారని అన్నారు. సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావాలో శాస్త్రీయమైన కోణంలో ఆలోచించి వాటిని అమలు చేసి చూపించారని తెలిపారు. అందులో నుండి వచ్చినదే కమ్యూనిస్టు మెనిఫెస్టో అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు,కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ,తాడి పైడియ్య, కొట్టు రమణారావు,కార్యవర్గ సభ్యులు తూనం వీరయ్య,సింగరాజు సాంబశివరావు,ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.యుగంధర్, ఏఐటీయూసీ అధ్యక్షుడు కేఆర్ ఆంజనేయులు,కోటా రాంబాబు, నడికుదిటి వెంకటేశ్వరరావు, రాయన గురునాథం,మారుతీ రావు,సిపిఎం నాయకులు ఆంజనేయులు,దుర్గారావు తదితరులతో పాటు సీపీఐ, సీపీయం నాయకులు, పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *