పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం


విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు సరైన ధర లభిస్తుందని తెలిపారు.
కనీస మద్దతు ధర (క్వింటాకు రూ,5,875)తో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయని రైతులు తమ శనగలను, దళారుల బెడద లేకుండా, రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకుని ఈ కేంద్రాల్లో విక్రయించవచ్చును తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరప్రసాద్, టిడిపి పార్టీ నాయకులు తిమ్మప్ప, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు మరియు పార్టీ నాయకులు, అధికారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *