News Updates: ఎల్పీజీ బదులు పీఎన్‌జీ సిలిండర్లు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్యానిక్ వల్లే గ్యాస్ బుకింగ్స్ పెరిగాయని కేంద్రం స్పష్టం చేసింది. వంట గ్యాస్ కొరతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విదేశాల నుంచి చమురు దిగుమతిపై చర్యలు తీసుకుంటున్నామని షిప్పింగ్ శాఖ అధికారులు తెలిపారు. పోర్టుల్లో పరిస్థితి అదుపులో ఉంది. రాష్ట్రాలకు కిరోసిన్‌ను ఇప్పటికే కేంద్రం కేటాయించింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటామని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. 30 శాతం ఎల్పీజీని పెంచామన్న సుజాత శర్మ. అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్స్ చేయవద్దని కేంద్రం తెలిపింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్లపై యుద్ధం ఎఫెక్ట్ గట్టిగా ఉంది. ఈ క్రమంలో సెన్సెక్స్ 1470 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లలలో కంగారు నెలకొంది. 74,564 పాయింట్ల వద్ద స్థిరపడిన సెన్సెక్స్.. 23,151 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 92.50 వద్దకు చేరుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వి.కే. శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం’ అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.


