ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు రిటైర్డ్, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు డాక్టర్ నరసింహులు తో పాటు పుల్లయ్య, రాధమ్మ, డాక్టర్ రంజిత్, డాక్టర్ గణేష్ ,డాక్టర్ వైష్ణవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రంలో ఇప్పటివరకు 66 మంది వైద్య చికిత్సలను పొందుతూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారని ఈ సౌకర్యాన్ని కలిగించిన ధర్మవరం ఎమ్మెల్యే ,ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి రోగులకు అందుతున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఈ డయాలసిస్ కేంద్రం వలన ఎంతోమంది ప్రాణదాతలుగా ఉంటున్నారని తెలిపారు. డయాలసిస్ రోగులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మందులు తీసుకోవాలన్న జాగ్రత్తలను విధి విధానాలను వివరించారు. అనంతరం ల్యాబ్ టెస్టు యొక్క ఫలితాలతో పాటు వాటి ద్వారా వైద్య చికిత్సలు కూడా పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో రిటైర్డ్ డాక్టర్ నర్సింహులు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆసుపత్రి మేనేజర్ మునింద్రులను డాక్టర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో రోగులు తదితరులు పాల్గొన్నారు.


