విశాలాంధ్ర – విశాఖపట్నం: సరకు రవాణాలో విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) రికార్డు సృష్టించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 345 రోజుల్లోనే 85.07 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా చేసింది. తద్వారా చరిత్రాత్మక మైలు రాయిని చేరుకుంది. 92 ఏళ్ల విశాఖ పోర్టు చరిత్రలో ఈ స్థాయి సరకు రవాణా ఎప్ప్పుడు జరగలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 90 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని సాధిస్తామన్న నమ్మకం ఉన్నట్లు పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ అంగముత్తు వెల్లడించారు.2026-27 ఆర్థిక సంవత్సరంలో 100 ఎంఎంటీ సరకు నిర్వహణ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని ఆయన దీమాగా చెప్పారు.
The post సరకు రవాణాలోవిశాఖ పోర్టు రికార్డు appeared first on Visalaandhra.


