హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్


మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్

విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: 

దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం చిన ఈ ఆసుపత్రిలో 550 పడకల సామర్థ్యం ఉంది. ముఖ్యంగా ఐదు సెకన్లలో గుండె స్కాన్ పూర్తి చేసే అత్యాధునిక హార్ట్ స్కానింగ్ టెక్నాలజీని మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. 640-స్లైస్ సిటీ స్కాన్ సాంకేతికతను ఏర్పాటు చేసి మరింత స్పష్టమైన చిత్రీకరణతో వేగవంతమైన, ఖచ్చితమైన నిర్ధారణకు అవకాశం కల్పించారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ… “తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఎంతో సహాయపడతాయి” అని తెలిపారు. మెడికవర్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ జి. అనిల్ కృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. శరత్ రెడ్డి మాట్లాడుతూ, 640-స్లైస్ సీటీ స్కాన్, వేగవంతమైన హార్ట్ స్కానింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఖచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందించగలమన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రపంచ స్థాయి వైద్య సేవల అవసరం పెరుగుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ ఎ.ఆర్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు, సమగ్ర వైద్య విధానాలతో రోగులకు వేగవంతమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

The post హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *