ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి..


మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం ; ఆర్ఓబి పనులను ఆర్ అండ్ బి అధికారులు, ఆర్ఓబి కాంట్రాక్టర్లు వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ తన ఛాంబర్ లో వారితో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో పనుల మీద పట్టణంలో వెళుతుంటారని అటువంటి వారికి ఆర్ఓబి పనులు జరగకపోవడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేకాక ఎక్కడబడితే అక్కడ గుంతలు ఉండడం వల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. తదుపరి ఎర్రగుంట వైయస్సార్ సర్కిల్ వద్ద కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని కట్టడి చేసే బాధ్యత ఆర్ఎన్బి అధికారులదేనని వారు స్పష్టం చేశారు. ప్రజల నుండి ఫిర్యాదులు అందక ముందే పనులు పూర్తిచేసేలా వెంటనే చర్యలు చేపట్టాలని వారు ఆదేశించారు.

The post ఆర్ఓబి పనులను వేగవంతం చేయండి.. appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *