విశాలాంధ్ర, నెల్లిమర్ల /కంటోన్మెంట్ :నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపి కమర్షియల్ సిలిండర్‌పై ₹150, గృహ అవసరాల సిలిండర్‌పై ₹60 పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి లడ్డు చుట్టూ రాజకీయాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు.ఈ కార్యక్రమంలో తాలాడ రామకృష్ణ, కనకల పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.


