-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ
విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో బి. విజయలక్ష్మి, తహశీల్దార్ పి. విజయకుమారితో కలిసి రూ.50లక్షల అంచనా వ్యయంతో సుందరీకరణకు భూమిపూజ చేశారు. చెరువు కట్టకు 4.5మీటర్ల వెడల్పు చేయడంతోపాటు ఆహ్లాదం పంచేందుకు ఇరువైపులా పచ్చని చెట్లు నాటుతామన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ట్రాక్ పొడవునా సోలార్ (సౌర) విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో విద్యుత్ ఆదా, రాత్రి వేళల్లో వాకర్స్‌కు సౌకర్యంగా ఉంటుందన్నారు. నీటి వృథాను అరికట్టేలా అత్యాధునిక పద్ధతుల్లో మొక్కలకు నీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు ఆధునిక పరికరాలతో ఓపెన్ జిమ్, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, వాకింగ్ ట్రాక్ నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో
ఏపీఓ సావిత్రి, ఈసీ మురళీ, ఇరిగేషన్ ఏఈ కృష్ణకుమార్, కనగానపల్లి మండల కన్వీనర్ పోతులయ్య, సోమర నారాయణస్వామి, సీసీ రాము, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు లక్ష్మినారాయణ, తలారి శివ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


