అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు – Visalaandhra


విశాలాంద్ర -వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలోని నూకవరం అంగన్వాడి సెంటర్ లో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి పరిశుభ్రతపక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీత పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుండి 15 వరకు అంగన్వాడీ పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు కేంద్రాల్లో పోషకాహార పరిశుభ్రత పాటించి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించుకొని పరిసరాలను పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు రక్త హీనత లేకుండా పోషక విలువల కలిగిన ఆహారాన్ని, ప్లాస్టిక్ రహిత అంగన్వాడీ కేంద్రంగా మార్చడం, పాత్రలు పరిశుభ్రంగా ఉంచడం, సురక్షిత ఆహారం చేయడంపై అవగాహన కల్పించారు.గర్భిణీ లకు, బాలింతలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు.పిల్లలు ఆహారం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు మట్టి పాత్రలో వంట చేయడంపై అవగాహన కల్పించడం జరిగింది చేతులు కడుక్కునే సరైన పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒక చిన్నారికి అక్షరాభ్యాసం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సునీత అంగన్వాడి వర్కర్స్ ధనలక్ష్మి,రమ అంగన్వాడీ హెల్పర్ అలేఖ్యగర్భవతులు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *