కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – Visalaandhra


విశాలాంధ్ర-​రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి కె. ముత్యాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
​6వ తరగతిలో మొత్తం 40 సీట్లు, ​ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు.
7 నుండి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల12వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ​అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *