వంట గ్యాస్‌ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్‌…


దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్‌ అండ్‌ రెస్టారంట్‌ అసోసియేషన్‌ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య సిలిండర్‌ ల కొరత ఏర్పడింది. దిల్లీ, బెంగళూరులో ఇప్పటికే కొన్ని హోటళ్లలో వంటగ్యాస్‌ అందుబాటు లేక తాత్కాలికంగా మూసివేస్తున్నారు. సిలిండర్ల కొరత వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్‌ను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బ్లాక్‌ విక్రయాలను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌ వ్యవధిని ప్రస్తుతమున్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. ఇక, వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. మన దేశంలో ఏటా 31.3 మిలియన్‌ టన్నుల వంటగ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 62 శాతం దిగుమతుల నుంచి వచ్చేదే. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిని మూసివేయడంతో ఈ దిగుమతులపై ప్రభావం పడింది. అయితే, ప్రస్తుతం మన వద్ద సరిపడా గ్యాస్‌ నిల్వలు అందుబాటులోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. రేపటి నుంచి బెంగళూరులో రెస్టారెంట్ల మూసివేత! నగరవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లను మూసివేయక తప్పదంటున్న అసోసియేషన్

గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని వెల్లడి
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరులోని రెస్టారెంట్లపై తీవ్రంగా పడింది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సిలిండర్ల సరఫరా హఠాత్తుగా నిలిచిపోయిందని, దీంతో రేపటి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ పేర్కొంది. తీవ్ర కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా రేపటి నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను నిర్వహించలేమని ఆ ప్రకటనలో తెలిపింది. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయిందని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించింది. యుద్ధం నేపథ్యంలో 70 రోజుల వరకు గ్యాస్ సరఫరాకు గ్యాస్ కంపెనీలు హామీ ఇచ్చాయని, కానీ అందుకు విరుద్ధంగా గ్యాస్ సరఫరా చేయడం లేదని ఆ ప్రకటనలో తెలిపింది. అందుకే ఈ నెల 10వ తేదీ నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంది.

The post వంట గ్యాస్‌ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్‌… appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *