మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి…

విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ప్రభృతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నదని , ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. ప్రతీ మహిళా రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన హక్కులను తెలుసుకోవాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 1398 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజి రుణాలుగా మంజూరు చేశామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో మహిళలు ఆపద సమయంలో 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందవచ్చన్నారు.పనిచేసే ప్రదేశంలో మహిళల భద్రతకు ఆయా కార్యాలయాలలో సంక్షేమ కమిటీలు ఏర్పాటుచేయాలన్నారు. మహిళాభివృద్దికి విద్య ఎంతో ముఖ్యమని, కుటుంబంలో ఒక మహిళా విద్యావంతురాలైతే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందని, ప్రతీ ఇంట్లో బాలికల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతీ మహిళా విద్యావంతురాలైతే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలు పురుషులకు ఏ విషయంలో కూడా తీసిపోరని, అన్ని రంగాలలో పురుషులకంటే మహిళలకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తారన్నారు.జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రతీ మహిళా శక్తీ యాప్ ను తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్ చేసుకుని, ఆపద సమయంలో శక్తీ యాప్ ద్వారా రక్షణ పొందవచ్చన్నారు.జిల్లాలో అనేక ప్రాంతాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వాటిని నియంత్రిస్తున్నామన్నారు.ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ మహిళల సంక్షేమం, భద్రతకు ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్నదన్నారు. తల్లికి వందనం, డ్వాక్రా రుణాలు, స్త్రీనిధి,ఉన్నతి రుణాలు,స్త్రీ శక్తీ, ద్వారా ఉచిత బస్సు, ఉచిత వంట గ్యాస్ అందిస్తున్నదన్నారు.దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు.ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ కుటుంబంలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి సాదిస్తున్నదన్నారు. కుటుంబాన్ని చక్కగా సంస్కారం, విలువలతో కూడిన కుటుంబంలో సంస్కారం, విలువలు పెంపొందించడంలో మహిళల పాత్ర ప్రముఖమైనదన్నారు.కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారిని జయ శర్మ, డిఆర్డిడిఏ పీడీ విజయలక్ష్మి,డి పిఓ కె.అనురాధ, డిఎంహెచ్ఓ డా. శోభ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఆర్.వి.నాగరాణి, ఐసిడిఎస్ పీడీ పి.శారద, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్, వడ్డీల కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు తహసీల్దార్ గాయత్రి, మెప్మా పీడీ రాజబాబు, వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ని కలెక్టర్ పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీనిధి, ఉన్నతి రుణాలను కలెక్టర్ అందించారు.
ఈ సందర్భంగా తమ వృత్తులలో విజయాలు సాధించిన మహిళలు, పలు రంగాలలో సేవలందించిన మహిళలు, ఉత్తమ సేవలందించిన మహిళా అధికారులు సిబ్బందిని మెమెంటోలతో కలెక్టర్ సత్కరించారు.
అసెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఐఎఫ్‌సి క్లస్టర్‌కు మహీంద్రా ట్రాక్టర్ఉ1, ఎగ్ కార్ట్ఉ1, డ్రోన్ఉ1,స్కూటర్స్ -4,వ్యవసాయ పనిముట్లు (పవర్ స్ప్రేయర్లు, టార్పోలిన్లు) జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అలాగే S్పు/ST డ్వాక్రా మహిళలకు ఉన్నతి మరియు Pవీ AజీAY పథకాల ద్వారా సబ్సిడీపై 4 ఎలక్ట్రిక్ బైకులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహూతులను అలరించాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *