ఇరాన్ స్పష్టీకరణ…
ట్రంప్ హెచ్చరికల బేఖాతరు
. ఇజ్రాయిల్, అమెరికా స్థావరాలపై దాడులు
. యూఏఈ, కువైట్‌పైకి డ్రోన్లు
. మాపై క్షిపణులతో దాడి: ఇజ్రాయిల్
. ఇరాన్‌ను చిత్తు చేశాం: ట్రంప్
తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. బేషరతుగా లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకునే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. ఇరుగు పొరుగు దేశాల్లోని ఇజ్రాయిల్అమెరికా స్థావరాýపై విరుచుకుపడింది. డ్రోన్లతో తీవ్ర దాడులు సాగించింది. యూఏఈ, కువైట్ పరిధి స్థావరాలను ఇరాన్ నేవీ లక్ష్యం చేసుకున్నట్లు సైన్యం ఒక ప్రకటన చేసింది. యూఏఈలోని అల్ మిన్హాద్ స్థావరంతో పాటు కువైట్‌లోని ఇజ్రాయిల్‌కు వ్యూహాత్మక స్థావరంపైనా దాడులు చేసినట్లు తెలిపింది. యూఏఈలోని అల్ దఫ్రా వైమానిక స్థావరంపై కూడా తమ దళాలు దాడి చేశాయని ఐఆర్జీసీ పేర్కొంది. ఇరాన్‌పై అమెరికాఇజ్రాయిల్ యుద్ధం రెండో వారానికి చేరుకుంది. ఏ దేశం కూడా వెనక్కు తగ్గడం లేదు. దీంతో యుద్ధం ఉధతంగా`విస్తతంగా సాగుతోంది. చరిత్రలో జరగని స్థాయిలో దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరికలు చేశారు. బేషరతుగా లొంగిపోవాలన్నారు. కానీ ఇరాన్ ససేమిరా అంటూ తమ శక్తిమేరకు దాడులు కొనసాగిస్తోంది. అయితే ఇరుగు పొరుగు దేశాలకు ఇరాన్ లొంగిపోయినట్లు అమెరికా విమర్శలు గుప్పించింది. కానీ ఇరాన్ తన వైఖరి మార్చుకోలేదు. తమ జోలికి వస్తే గట్టిగా బుద్ధిచెబుతామని హెచ్చరించింది. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తే ఇజ్రాయిల్అమెరికా స్థావరాలు, ప్రయోజనాలపై గురి పెడతామని తేల్చిచెప్పింది. ఇజ్రాయిల్ లక్ష్యంగా దాడులు జరిపింది. దీంతో ఎయిర్ రెయిడ్ అలర్టులు, పేలుళ్ల శబ్దాలు జెరూసలేంతో పాటు గల్ఫ్ దేశాల్లో వినిపించాయి. దుబాయి, మనామా, రియాద్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. ఫిఫా శాంతి పురస్కారం అందుకున్న దేశానికి చెందిన అధ్యక్షుడు ఫుట్‌బాల్ మైదానంపై దాడి చేయించడం దారుణమని ఇరాన్ విమర్శించింది. అమెరికా దాడులతో తెహ్రాన్‌లో ఆజాదీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దెబ్బతిన్న చిత్రాలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘెయీ పంచుకున్నారు. నోబెల్ శాంతి పురస్కారం కోసం ప్రచారం చేసుకున్న ట్రంప్‌కు గతేడాది డిసెంబరులో ఫిఫా నూతనంగా ప్రవేశపెట్టిన శాంతి పురస్కారాన్ని అందించిన విషయం విదితమే. గల్ఫ్ మన్నించాలి: పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ‘క్షమించండి, దాడులు తప్పలేదు. మీ దేశాలు మా లక్ష్యం కాదు. అక్కడి ఇజ్రాయిల్అమెరికా స్థావరాలపైనే గురి పెట్టాం. దాడుల్లో జరిగిన పొరపాట్లను మన్నించండి. మీ దేశాల్లోని స్థావరాలను మాపై దాడులకు వినియోగిస్తేనే ప్రతి దాడులు చేస్తాం’ అని పెజెష్కియాన్ వెల్లడించారు. ‘ఇరుగు పొరుగు దేశాలతో స్నేహం, ప్రాదేశిక శాంతిసమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించుకోవడానికి ఇరాన్ ఎల్లప్ప్పుడు కట్టుబడి ఉంది’ అని అన్నారు. అలాగని అమెరికాఇజ్రాయిల్ సైనిక దురాక్రమణను ప్రతిఘటించే ఇరాన్ హక్కును ఎవరూ కాదనలేరని వెల్లడించారు. తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ రక్షణకు బాధ్యతతో ఉన్నామని పెజెష్కియాన్ అన్నారు.
పశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన
ఇరాన్: ట్రంప్
ఇరాన్‌ను చిత్తు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించుకున్నారు. ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా దెబ్బతీసినట్లు చెప్ప్పుకున్నారు. ఇరాన్ పనైపోయిందని సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘పశ్చిమాసియాలోనే విఫల దేశం ఇరాన్. ఇరుగు పొరుగుకు లొంగిపోయింది. దాని పనైపోయింది కాబట్టే వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్ప్పుకున్నది. దాడులు చేయమని హామీనిచ్చింది. అమెరికాఇజ్రాయిల్ భీకర దాడులతోనే ఇరాన్ ఇలా చేసింది. ఆ దేశం పశ్చిమాసియాను ఏలాలని భావించింది కానీ ఇప్ప్పుడు చిత్తుగా ఓడిపోయింది. చాలా ఏళ్లలో పశ్చిమాసియాలో ఇరాన్‌కు ఇది తొలి పరాభవం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా దేశాలను తనకు కతజ్ఞతలు తెలిపాయని, తాను స్వాగతించానన్నారు. ‘పశ్చిమాసియాపై ఇరాన్ పూర్తిగా పట్టును కోల్పోయింది. ఈ దేశం లొంగిపోవాలి లేదంటూ పూరిగా నాశనం అవ్వాలి.... తిరిగి కోలుకోవాలంటే దశాబ్దాల సమయమే పడుతుంది. ఈరోజు (శనివారం) ఇరాన్‌కు మరణమే. ఆ దేశాన్ని తుడిచిపెట్టే స్థాయిలో దాడులు చేశాం. ఇందుకు ఇరాన్ చెడు ప్రవర్తనే కారణం’ అని ట్రంప్ అన్నారు. 80 యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ తమ దేశం తల వంచదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించిన వేళ 80 యుద్ధ విమానాలతో తెహ్రాన్ ప్రధాన విమానాశ్రయాలు లక్ష్యంగా ఇజ్రాయిల్ భీకర దాడులు చేసింది. తూర్పు బెక్కా లోయలోని నబీ చిట్ అనే లెబనాన్ పట్టణంలో ఇజ్రాయిల్ వైమానికభూతల దాడులు భీకరంగా సాగించింది. దీంతో 41 మంది చనిపోయారు. 40 ఏళ్ల కిందట లెబనాన్‌లో యుద్ధ విమానం కూలిపోవడంతో అదశ్యమైన ఇజ్రాయిలీ నేవిగేటర్ రాన్ అరాడ్ గురించి సమాచారాన్ని తమ దళాలు సేకరిస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. అరాడ్ అవశేషాలు తమ సైన్యానికి లభించలేదని పేర్కొంది. ఇజ్రాయిల్ దళాలు బలవంతంగా నబీ చిట్ నగరంలోకి ప్రవేశించాయని, అక్కడ శ్మశాన వాటికలోకి వెళ్లి ఓ సమాధిని తవ్వి… ఆపై నిష్క్రమించినట్లు స్థానికులు తెలిపారు.
16 విమానాలు కూల్చాం: ఇజ్రాయిల్
ఇరాన్ తమ దేశంపైకి క్షిపణులు ప్రయోగించిందని, వాటిని సమర్ధంగా అడ్డుకొని నష్టాన్ని నివారించామని ఇజ్రాయిల్ వెల్లడించింది. ఇరాన్‌కు సంబంధించిన 16 విమానాలను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఐఆర్జీసీ కుర్డ్స్ దళానికి చెందిన 16 యుద్ధ విమానాలను ఇజ్రాయిల్ సైన్యం కూల్చేసింది. మా వైమానిక దళం విస్తత దాడులు సాగించింది. మెహ్రాబాద్ విమానంతో పాటు ఇరాన్ రాజధానిని దద్దరిల్లించింది’ అని ఇజ్రాయిల్ ప్రకటించింది. మెహ్రాబాద్ విమానాశ్రయాన్ని కుర్డ్ దళం ఆయుధగారంగా వినియోగిస్తున్నట్లు ఆరోపించింది. లెబనాన్‌లో హెజ్బుల్లాతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా సాయుధ దళాలకు డబ్బు ఇక్కడ నుంచే చేరుతుందని పేర్కొంది.
సౌదీపైకి ఇరాన్ డ్రోన్లు
ఇరాన్ తాజా దాడులలో భాగంగా తమ దేశంపైకి వచ్చిన 15 బాలిస్టిక్ క్షిపణులు, 119 డ్రోన్లను సమర్ధంగా అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఒక క్షిపణి సముద్రంలో పడిందని రక్షణ శాఖ ‘ఎక్స’లో తెలిపింది. గగనతల రక్షణ వ్యవస్థలు 121 యూఏవీలను గుర్తించాయని, అందులో 119ను ధ్వంసం చేశాయని, రెండు డ్రోన్లు యూఏఈ భూభాగంలో పడ్డాయని వెల్లడించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక దళం దిశగా రెండు క్షిపణులు దూసుకురాగా వాటిని ధ్వంసం చేశాం. షాయాబ్ చమురు క్షేత్రం మీదకు డ్రోన్లతో దాడిని అడ్డుకున్నామని సౌదీ వెల్లడించింది.
లెబనాన్ఇజ్రాయిల్ చర్చలు అవశ్యం: ఐరాస ప్రతినిధి లెబనాన్‌లో ఇజ్రాయిల్హెజ్బుల్లా మధ్య పోరును అంతం చేసేందుకు చర్చలకు రావాలని లెబనాన్, ఇజ్రాయిల్‌కు ఐరాసకు లెబనాన్ ప్రత్యేక సమన్వయకర్త పిలుపునిచ్చారు. ఇప్ప్పుడు ఉన్న పరిస్థితులు రానురాను మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు. ‘లెబనాన్`ఇజ్రాయిల్ మధ్య చర్చలు గేమ్‌ఛేంజర్ కావచ్చు. మళ్లీ మళ్లీ ఇలాంటి కాళరాత్రిని చవిచూడాల్సిన పని లేకుండా భావితరాలను కాపాడేందుకు సమాలోచనలు బాటలు వేయగలవు’ అని సూచించారు. లెబనాన్‌లో శాంతి దళాలపై దాడులను ఖండించారు.
ఇజ్రాయిల్‌పై హెజ్బుల్లా దాడి
ఇజ్రాయిల్ స్థావరాలపై దాడులు చేసినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. ఉదయం 9.45 గంటలకు ఇజ్రాయిలీ నగరం అక్రేకు తూర్పున ఉన్న ఝిఫిన్ స్శావరంపైకి క్షిపణులు ప్రయోగించినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 12.30 గంటలకు లెబనాన్ సరిహద్దు పట్టణం కఫర్ కిలాలోని ఫాతిమా ద్వారం వద్ద వాహనాలపైకి రాకెట్లతో దాడి చేసినట్లు పేర్కొంది. లెబనాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ దాడులకు ప్రతీదాడులు చేసినట్లు హెజ్బుల్లా తెలిపింది. లెబనాన్ సరిహద్దుకు దగ్గరగా ఇజ్రాయిల్‌లోని కిర్యత్ ష్మోనా ప్రజలను అక్కడ నుంచి దక్షిణం వైపునకు వెళ్లిపోవాలని హెజ్బుల్లా హెచ్చరించింది.
హెజ్బుల్లాను నిర్వీర్యం చేయకపోతే మూల్యం తప్పదు: కట్జ్
హెజ్బుల్లా నిరాయుధీకరణ కోసం ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ డిమాండ్ చేశారు. అలా జరగని పక్షం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లెబనాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘లెబనాన్‌పై ప్రాదేశిక కక్షలేదు కానీ లెబనాన్ భూభాగం నుంచి చాలా ఏళ్లుగా కొనసాగుతున్న దాడులను ఉపేక్షించబోం. అందుకోసమే హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే చర్యలు తీసుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’ అని లెబనాన్‌కు కట్జ్ స్పష్టంచేశారు.
లెబనాన్ శాంతి దళాలపై దాడికి ఐరాస ఖండన
లెబనాన్‌లో శాంతి దళాలపై దాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఖండించారు. దక్షిణ లెబనాన్‌లోని ఐరాస స్థావరంపై శనివారం దాడి జరిగింది. ఘనాకు చెందిన ముగ్గురు శాంతి దళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని ఘనా కూడా ఖండించింది. దీనిపై ఐక్య రాజ్య సమితికి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. బాధ్యులను గుర్తించి, వారినై తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం యుద్ధ నేరంతో సమానమని ఆక్షేపించింది. ఐరాస శాంతి దళాలకు సముచిత రక్షణ కల్పించాలని ఘనా కోరింది.
The post తలొగ్గేది లేదు appeared first on Visalaandhra.


