‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ


ఖతార్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలు ఈ వెబ్ సైట్ ద్వారా తెలియచేయాలి

న్యూదిల్లీ: ఖతార్‌ లోని భారత ఎంబసీ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ‘హయ్య ఏ1 వీసాదారులు, తాత్కాలిక వీసా కలిగిన భారత పౌరులు వెంటనే తాము షేర్ చేసిన లింక్‌లో వివరాలు నింపాలని ఎంబసీ సూచించింది. అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ ఘర్షణల వేళ.. పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ దేశంలో ఎంతమంది భారతీయులు చిక్కుకుపోయారో తెలుసుకోవడానికి, వారికి సహాయం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హయ్య ఏ1 వీసా (Hayya A1 ).. ఖతార్‌లో పర్యటించాలనుకునేవారికి ఇచ్చే సింగిల్ ఎంట్రీ ఎలక్ట్రానిక్ వీసా. దీనిని ‘హయ్య వెబ్‌సైట్‌్ణ లేక ‘హయ్య టు ఖతార్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకుంటారు. ఒకసారి ఈ వీసాను పొందినవారు గడువు ముగిసిన తర్వాత మరో 30 రోజులు పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28న మొదలైన ఘర్షణల కారణంగా ఖతార్ నుంచి బయల్దేరాల్సిన విమానాలు రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది భారతీయులు ఆ దేశంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే గల్ఫ్‌ దేశాల సహకారంతో భారత ప్రభుత్వం కొన్ని ప్రత్యేక విమాన సర్వీసులు నడిపి అక్కడ చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొస్తోంది.

The post ‘హయ్య ఏ1్ణ వీసాదారులకు.. భారత్‌ ఎంబసీ అడ్వైజరీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *