మా తదుపరి లక్ష్యం క్యూబా: ట్రంప్


వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయిల్‌తో కలిసి భీకర దాడులు కొనసాగిస్తున్న అమెరికా తమ తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా భద్రతకు క్యూబా పెద్ద ముప్ప్పు అని ఆయనన్నారు. క్యూబా విదేశాంగ విధానం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు. అమెరికాకు పక్కలో బల్లంలా క్యూబా తయారైందని, తమ పక్కనే ఉంటూ శత్రు దేశాలకు సహకరిస్తోందని ఆరోపించారు. ఇరాన్ తర్వాత లక్ష్యం కL్యబా అని ట్రంప్ స్పష్టంచేశారు. ‘ముందు ఇరాన్ పని ముగించి.. ఆ తర్వాతే క్యూబా సంగతి చూస్తాం’ అని ప్రకటించారు. క్యూబాపై ఎప్ప్పుడు, ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆయన వెల్లడించలేదు.
ఇరాన్ పతనం తథ్యం: ఇజ్రాయిల్ దళాలతో కలిసి తమ సైన్యం ఇరాన్‌లో అత్యంత వ్యూహాత్మకంగా మెరుపు దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అనుకున్న దాని కంటే వేగంగానే ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసం చేస్తున్నామన్నారు. ఇరాన్ రక్షణ సామర్థ్యం, ప్రతిఘటనా శక్తి క్షీణించిందని తెలిపారు. ఆధునిక సాంకేతికత` క్షిపణి వ్యవస్థలతో ఈ దాడుల జరుగుతుండటంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోందని ట్రంప్ అన్నారు. ఉమ్మడి వ్యూహంతో ఇరాన్ పతనం తథ్యమని దీమాగా చెప్పారు. వెనిజులా తరహాలో ఇరాన్ కొత్త నాయకత్వం ఎంపికలో తనకు పాత్ర ఉండాలని ట్రంప్ స్పష్టంచేశారు. ఇరాన్ స్వాధీనం తమ ఉద్దేశం కాదని, అది సమయం వధా కార్యమని ఆయన వ్యాఖ్యానించారు. భూతల దాడుల ఆలోచన లేదని కూడా చెప్పారు. ఇరాన్ నావికా దళం పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ దేశం అన్నింటిని కోల్పోయి బలహీనమైందని ట్రంప్ అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *