22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి


. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి
. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష

విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం, రీ సర్వే, ఆడంగల్ లో భూమి రికార్డునమోదు, కోర్ట్ కేసులు పరిష్కారం ,ఆర్ ఓ ఆర్, తదితర  అంశాలపై జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నిషేదిత భూముల జాబితాలో జిరాయితీ భూములు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి 229 విజ్ఞప్తులు అండగా వాటిలో 18 పరిష్కరించడం జరిగిందని, 10 కేసులు రిజెక్ట్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన విజ్ఞపులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలన్నారు. మార్చి నెలలో 2249 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయవలసి ఉండగా, 2184 పాస్ పుస్తకాలు పంపిణీ చేశామని, మిగిలినవి రెండు రోజుల్లోగా పంపిణీ చేయవలసిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూమి యాజమాన్యం, సాగు విస్తీర్ణం, హద్దులు, పట్టాదారు పాస్ పుస్తకాలు ఆర్ ఓ ఆర్ కు సంబంధించి ఏ ఒక్క అంశం పెండింగ్. లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని లని జిల్లాకలెక్టర్ కె. వెట్రి సెల్వి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవిన్యూ శాఖలో కోర్ట్ కేసులకు సంబంధించి వాటికి వెంటనే కౌంటర్ వేయించాలన్నారు.
పీజీ ఆర్ఎస్ లో పెండింగ్ లో ఉన్న ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ లు, సర్వే శాఖాధికారి అన్సారీ, వివిధ మండలాల తహసీల్దార్లు, ప్రభృతులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *