-శ్రీ సత్య సాయి సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా శ్రీ సత్య సాయి సేవ సమితి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఇటువంటి సేవాసమితి ధర్మారంలో ఉండడం రోగులకు వరం లాగా మారిందని తెలుపుతూ, ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.


