పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి – Visalaandhra


పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లడం జరిగిందని తెలిపారు. మార్చి 4వ తేదీ నాటికి ఇంటి పన్ను ఎనిమిది కోట్ల 50 లక్షల రూపాయలు ఉండగా, కుళాయి పన్నులు ఏడు కోట్ల 50 లక్షలు బకాయిలు కలవని తెలిపారు. ఈ సందర్భంగా జనవరి నెల నుంచి మార్చి 4వ తేదీ వరకు ఇంటి పన్నులు ఒక కోటి 50 లక్షల రూపాయలు వసూలు కావడం జరిగిందని, అదేవిధంగా కొళాయి పన్నులు 69 లక్షల 80 వేల రూపాయలు వసూలు కావడం జరిగిందని తెలిపారు. మిగిలిన బకాయిలను మార్చి మాసము లోపు చెల్లించే విధంగా ప్రజలు కూడా సహకరించాలని తెలిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో మొత్తము 9 బృందాలు రెవెన్యూ వసూలు కొరకు తిరుగుతున్నారని తెలిపారు. మా సిబ్బంది మీ వద్దకు వచ్చినప్పుడు సహకరించి, నగదు చెల్లించి, రసీదు పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివా, రవి తో పాటు బృందాల సభ్యులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *