కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి



న్యూదిల్లీ :
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వారిని స్క్వాడ్రన్ లీడర్ అనూజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దుర్గాకర్ గా అధికారులు గుర్తించారు. వీరి మృతికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంతాపం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగవలసి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *