ఉత్కంఠ పోరులో భారత్ విజయం – ఫైనల్‌లోకి టీమిండియా


. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం
. భారత్ 253/7, ఇంగ్లాండ్ 246/7

ముంబయి : టీ20 ప్రపంచ కప్ 2026 లో భారత్ నాలుగోసారి అత్యంత ఉత్కంఠతో ఫైనల్‌కి చేరుకుంది. భారత జట్టు 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం చేజిక్కిచుకుంది. టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. భారీ ఇన్నింగ్స్ ఆడినా ఇంగ్లాండ్‌కు ఓటమి చూడక తప్పలేదు. భారత బౌలర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్జీదీప్ సింగ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొటగా హార్దిక్ పాండ్య 2 వికెట్లు పడగొట్టాడు. తొలుత భారత బ్యాటర్లలో సంజు శాంసన్ (89; 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబె (43; 25 బంతుల్లో ఒక ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (39; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్ లు) ఆడారు. హార్దిక్ పాండ్య (27), తిలక్ వర్మ (21) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2, అదిల్ రషీద్ 2, ఆర్చర్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు. ఆదివారం అహ్మదాబాద్లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

The post ఉత్కంఠ పోరులో భారత్ విజయం – ఫైనల్‌లోకి టీమిండియా appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *